వరుస ఓటములతో కాంగ్రెస్ పార్టీ కృంగిపోయింది. ఒకవైపు రాష్ట్రాలలో ఓటములు… మరోవైపు ప్రధాని మోడీ హావా, ఇంకో వైపు వలసలు… దీంతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దిగజారిపోయింది. అయితే, దీనికి అడ్డుకట్ట వేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్దమయింది. దీనిపై రేపు (మంగళవారం) ఢిల్లీలో చర్చించనున్నది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధి అధ్యక్షతన ఈ సమావేశం జరగనున్నది. ఇక కొన్ని రోజులలో ఢిల్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఆ ఎన్నికలలో బీజేపిని, ఆమ్ ఆద్మీ పార్టీని ఎలా ఎదుర్కోవాలో దానిపై కూడా చర్చించనున్నారు.
ఇక, భూసేకనరణపై మోడీ సర్కారు తీసుకొచ్చిన సవరణలపై కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఎటువంటి విధానాలు అవలంభించాలి అన్న విషయాలపై కూడా చర్చించనున్నారు. అంతేకాకుండా, రాష్ట్రాల పీసీసీల మధ్య మరియు, యువజన కాంగ్రెస్ నాయకుల మధ్య మరింత సమన్వయం తీసుకొచ్చేందుకు కూడా చర్యలు చేపట్టనున్నట్టు తెలుస్తున్నది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకునేందుకు కసరత్తు ప్రారంభించింది.