భారత్‌లో కరోనా కల్లోలం.. 22 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు..!

Monday, August 10th, 2020, 11:52:50 AM IST

భారత్‌లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుంటే, అదే స్థాయిలో మరణాలు కూడా నమోదవుతున్నాయి. అయితే గడిచిన 24 గంటల్లో 62,064 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

ఇప్పటి వరకు మొత్తం 22,15,074 కరోనా కేసులు నమోదు కాగా ప్రస్తుతం అందులో 6,34,945 యాక్టివ్ కేసులు ఉండగా, 15,35,743 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో కరోనాతో ఏకంగా 1007 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 44,386 చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 4,77,023 కరోనా టెస్టులు చేయగా మొత్తం టెస్టుల సంఖ్య 2,45,83,558 కి చేరింది. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 69.3గా ఉండగా, మరణాల రేటు 2 శాతంగా ఉంది.