కరోనా అప్డేట్: భారత్‌లో 62 లక్షలు దాటిన కరోనా కేసులు..!

Wednesday, September 30th, 2020, 11:27:35 AM IST

భారత్‌లో కరోనా కేసులు సంఖ్య నాలుగు రోజుల నుంచి కాస్త తగ్గుతుందని భావించినా మళ్ళీ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. అయితే తాజాగా గడిచిన 24 గంటల్లో 80,472 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనాతో 1,179 మంది చనిపోయారు. అయితే దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 62,25,763 కి చేరింది.

అయితే ప్రస్తుతం అందులో 9,40,441 యాక్టివ్ కేసులు ఉండగా, 51,87,825 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే ఇప్పటివరకు మొత్తం 97,497 మంది కరోనా బారిన పడి చనిపోయారు. ఇక నిన్న దేశవ్యాప్తంగా 86,428 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 10,86,688 శాంపిల్స్ పరీక్షించారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 83.3 శాతం ఉండగా, మరణాల రేటు 1.6 శాతంగా ఉంది.