భారత్‌లో 85 లక్షలు దాటిన కరోనా కేసులు.. నేడు కొత్తగా ఎన్నంటే?

Sunday, November 8th, 2020, 03:03:46 PM IST

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య ఆగడం లేదు. గతంలో రోజుకు లక్షకు చేరువలో కొత్త కేసులు నమోదవుతుండగా, వెయ్యికి పైగా మరణాలు నమోదు అయ్యేవి. అయితే ఇప్పుడు అది కాస్త తగ్గింది. తాజాగా గడిచిన 24 గంటల్లో కేవలం 45,674 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 559 మంది చనిపోయారు. అయితే దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 85,07,754 కి చేరింది.

అయితే ప్రస్తుతం అందులో 5,12,665 యాక్టివ్ కేసులు ఉండగా, 78,68,968 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే ఇప్పటివరకు మొత్తం 1,26,121 మంది కరోనా బారిన పడి చనిపోయారు. ఇక నిన్న దేశవ్యాప్తంగా 49,082 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 11,94,487 శాంపిల్స్ పరీక్షించారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 92.5 శాతం ఉండగా, మరణాల రేటు 1.5 శాతంగా ఉంది.