గుండె పై కరోనా మహమ్మారి ప్రభావం

Thursday, March 4th, 2021, 08:37:37 AM IST

ప్రపంచ దేశాలు కరోనా వైరస్ భారిన పడి అనారోగ్యం పాలు అవుతున్నాయి. వాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ ఈ వైరస్ ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ మహమ్మారి గుండె పని తీరు పై ప్రభావం చూపిస్తుంది అంటూ శాస్త్రవేత్తలు అంటున్నారు. కరోనా వైరస్ బాధితుల గుండె రక్త ప్రసరణ సామర్థ్యం తగ్గుతుండటం పట్ల వాషింగ్ టన్ కి చెందిన సైంటిస్ట్స్ పరిశోధనలు జరిపారు. అయితే ఈ పరిశోదన లో కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.

గుండె కణజాలం పై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది అని వ్యాఖ్యానించారు. ఇలా ఉండటం చేత కణాలు మృతి చెంది, కండరాలు కుచించుకు పోతున్నాయి అని వ్యాఖ్యానించారు. అయితే ఈ పరిశోధన లో మహమ్మారి భారిన పడిన కొందరి ఆరోగ్య పరిస్తితి పై నిశీతంగా పరిశీలించారు. ఇలా చేయడం ద్వారా ఒక నిర్దారణ కి వచ్చారు. ఇతర వైరస్ లతో పోల్చితే గుండె పై కరోనా వైరస్ మహమ్మారి ప్రత్యేక ప్రభావం చూపుతోంది అని అన్నారు. ఈ విషయం లో రోగ నిరోధక వ్యవస్థ పని తీరు భిన్నంగా ఉంటుంది అని తెలిపారు. కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా హృదయ కండరాల్లో ఉన్నటువంటి ఫైబర్ యూనిట్లు అచేతనం అవుతున్నాయి అని అన్నారు. అలా ఉండటం వలన కండరాలు బిగుసుకు పోయి, గుండె సామర్థ్యం తగ్గిపోతుంది అని వ్యాఖ్యానించారు. అయితే ఎలాంటి అంతర్గత వాపులు లేని వారిలోనూ, యువకుల్లో కూడా ఈ సమస్య తలెత్తుతుంది అని కోరి లావైన్ తెలిపారు. అయితే దీని పై లోతుగా అధ్యయనం చేయడం ద్వారా గుండె పై ప్రభావాన్ని నియంత్రించ వచ్చు అని వ్యాఖ్యానించారు. అయితే ఇంకా ఈ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉండటం తో ప్రజలు కాస్త ఆందోళన చెందుతున్నారు.