అంత భద్రత ఎందుకు.. సీఎం జగన్‌కు రామకృష్ణ సూటి ప్రశ్న..!

Thursday, April 1st, 2021, 04:35:05 PM IST

ఏపీ సీఎం జగన్‌పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకునేందుకు సీఎం జగన్‌కు పోలీస్ పహారా ఎందుకు అంటూ ప్రశ్నించారు. ఈ రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రా? లేక విదేశీ తీవ్రవాదా అని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో గుంటూరు ప్రజలు వైసీపీనీ గెలిపించినా జగన్ ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు.

టీకా కార్యక్రమానికి 10 మంది డీఎస్పీలు, 30 మంది సీఐలు, 59 మంది ఎస్ఐలు, 147 మంది ఏఎస్ఐలు, 647 మంది కానిస్టేబుల్‌లతో భద్రత కల్పించటానికి గుంటూరు ఏమన్నా ఆఫ్ఘనిస్తానా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో 7 కిలోమీటర్ల పొడవునా బారికేడ్లు ఏర్పాటు చేసి, 40 గంటల పాటు ఆ ప్రాంత వాసులను ఇళ్ళల్లో బందీలుగా చేయటం ఎందుకని ఇదేనా మీ ప్రజా పాలన అని రామకృష్ణ నిలదీశారు.