క్రైమ్ కహాని : అవి తగ్గలేదని ఒకరు.. అసహనంతో మరొకరు..!

Thursday, January 21st, 2016, 01:00:01 PM IST

విశ్వవిద్యాలయంలో మహాఘోరం : హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో పరిశోధన విద్యార్ధి రోహిత్ ఇటీవలే ఆత్మహత్య చేసుకున్నారు. ఇందుకు కారణం అతనిని దేశద్రోహుడిగా చిత్రీకరించడమేనట. విశ్వవిద్యాలయంలో కొందరు దేశద్రోహానికి పాల్పడుతున్నారని అంటూ కొన్ని విద్యార్ధి సంఘాలు కేంద్ర మంత్రికి లేఖ వ్రాశారు. ఆ లేఖను మనవ వనరుల శాఖకు బదిలీ చేయడంతో.. విశ్వవిద్యాలయం సదరు విద్యార్ధులపై చర్యలు తీసుకునేందుకు సిద్దమయింది. మొత్తం ఐదుగురు విధ్యార్ధులపై చర్యలు తీసుకుంది. దీంతో రోహిత్ అనే విద్యార్ధి అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

మొటిమలు తగ్గలేదని .. హవ్వా..: యవ్వనం వచ్చాక మొహంపైన మొటిమలు రావడం సహజమే. మొటిమలు తగ్గడానికి ఎన్నో మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని వాడుతూ.. ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. అయితే, మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన 22 సంవత్సరాల యువతి ఎన్ని మందులు వాడినా మొహంపైనున్న మొటిమలు తగ్గలేదని చెప్పి పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. కంటిన్యూగా ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోయే దానికి, ఇలా ఆత్మహత్య చేసుకోవడం ఏమిటని అంతా అనుకుంటున్నారు.

మొనగాడి భార్య : బీహార్ లోని పూర్నియా ప్రాంతానికి చెందిన జెడియూ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రూపాలీ భీమా భారతి అనే మహిళ ఓ సాహాసం చేసింది. రూపాలి భర్త అవదేష్ మండల్ 2005లో చంచల్ అనే వ్యక్తిని హత్య చేశారు. దీంతో అతనిపై కేసు నమోదయింది. ఈ కేసులో మండల్ కు వ్యతిరేకంగా చంచల్ భార్య కోర్టులో సాక్ష్యం చెప్పింది. దీంతో చంచల్ భార్యను, పిల్లలను బెదిరించారట. చంచల్ భార్య పిల్లలను బెదిరించడంతో ఆమె బంధువులు అతనిపై దాడి చేశారు. అంతేకాకుండా.. మండల్ పై కేసు నమోదు చేశారు. దీంతో అతనిని అరెస్ట్ చేసి పూర్నియా పోలిస్ స్టేషన్ కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మండల్ భార్య తన 150 మంది మద్దతుదార్లతో అక్కడికి చేరుకొని మండల్ పై దాడి చేసిన వారిపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు మండల్ చేతికి వేసిన సంకెళ్ళను తీయగానే.. అక్కడే ఉన్న రూపాలి పోలీసుల కళ్ళు కప్పి భర్తతో సహా కారులో ఉడాయించింది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు ఆ భార్యా భర్తలు.