పెళ్లి లో భార్య డాన్స్ చేసిందని భర్త ఏమి చేసాడంటే!!

Monday, March 19th, 2018, 02:00:44 PM IST

ఒకరినొకరు అర్ధం చేసుకున్నప్పుడే భార్య భర్తల బంధం కలకాలం ఆనందంగా సాగుతుందని మన పెద్దలు చెపుతుంటారు. నిజానికి పూర్వకాలం లో కూడా భార్య భర్తల మధ్య చిన్నపాటి గొడవలు, మనస్పర్థలు వస్తుండేవి. కాకపోతే మరీ చిన్న చిన్న విషయాలకు విడిపోవడం, ఒకరిపై ఒకరు కక్ష కలిగివుండడం ఒకరకంగా తక్కువనే చెప్పాలి. నేడు ఆలుమగలు ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి చివరికి ప్రాణాలను సైతం తీయడం వంటివి చేస్తున్నారు. అందుకు ప్రధాన కారణం నేటి మానవుడి జీవన విధానాలే అని మానసిక నిపుణులు అంటున్నారు.

ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంఘటన మనిషిలోని క్రూరత్వానికి నిలువెత్తు సాక్ష్యం. వివాహ వేడుకలో డ్యాన్స్ చేసిందనే అక్కసుతో తన భార్యను ఓ భర్త దారుణంగా చంపేశాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ ఇరవైనాలుగు పరగణాల జిల్లాలోని బసంతిలో చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళితే, స్వప్నఅనే యువతికి సుబీర్ నష్కర్ అనే వ్యక్తితో ఇటీవలే వివాహం జరిగింది. అయితే మొన్న ఒకరోజు తమ బంధువుల వివాహా వేడుకకు సుబీర్, స్వప్న తమ తల్లిదండ్రలతో కలిసి వెళ్లారు. అక్కడ స్వప్న కొంత మంది యువకులతో కలిసి డ్యాన్స్‌ చేసింది. అది సుబీర్‌కు నచ్చలేదు. దీంతో సుబీర్ అందరి ముందే భార్యతో గొడవ పెట్టుకొని, డ్యాన్స్ ఎందుకు చేశావని అందరిముందు నిలదీశాడు. దీంతో స్వప్న అలిగి ఇంటికి వెళ్ళిపోయింది.

అనంతరం తల్లితో కలిసి సుబీర్‌ ఇంటికి వెళ్ళిన సుబీర్, అదే సంఘటనను తలుచుకుని, తట్టుకోలేక తల్లితో కలిసి స్వప్నను గొంతు నులిమి చంపేశాడు. ఆపై తన భార్య ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టుగా అందరిని నమ్మించేందుకు ప్రయత్నించాడు. అయితే స్వప్న తల్లిదండ్రులు సుబీరే తమ కూతురిని హత్యచేశాడని కేసు పెట్టారు. అయితే చివరికి పోలీసులు విచారణలో అసలు విషయాలు వెలుగు చూశాయి. దీంతో సుబీర్‌, అతని తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్న పోలీస్ లు అతని పై కేసు పెట్టి అదుపులోకి తీసుకున్నారు…