దెబ్బకి యాంకర్ ఔట్

Friday, September 19th, 2014, 05:06:13 PM IST


విదేశీయుల పేర్లు చాలా విచిత్రంగా ఉంటాయి. వాటిని మాములుగా పలకాలంటే చాలా కష్టం.అదే ఇక చైనీయుల పేర్లు పలకాలంటే మరీ కష్టంగా ఉంటుంది. వారి పేర్లు ఎలాగుంటాయో…. ఎవరికీ అర్ధంకాదు.. అవి పేరులో అర్ధంకాదు.. రోమన్ లెటర్సో అర్ధంకాదు. పేర్లను తెలియని వారు చదివితే ఓకే.. కాని.. ఒక ప్రఖ్యాత చానల్ లో ఒక దేశానికి చెందిన అధ్యక్షుని పేరుని తప్పుగా చదివితే ఇంకేమన్నా ఉన్నదా..

చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ భారతదేశ పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. చైనా అధ్యక్షుడి పేరును దూరదర్సన్ చానల్ యాంకర్ తప్పుగా చదవడంతో పాపం, యాంకర్ ఉద్యోగం ఊడిపోయింది. జీ జిన్ పింగ్ పేరును ఇంగ్లీష్ లెటర్స్ లో XI అని రాయడంతో ఆ యాంకర్ ఎలా చదవాలో అర్ధంగాక 11వ జిన్ పింగ్ అని చదవడంతో, క్షమించరాని తప్పుగా భావించి, యాంకర్ ను ఉద్యోగంలోనుంచి తొలగించారు. మామూలు తప్పు అయితే ఎలాగో సరిపెట్టుకోవచ్చు కాని ఒక దేశాధ్యక్షుడి పేరు తప్పుగా చదవ