డెక్కన్ క్రానికల్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి అరెస్ట్!

Sunday, February 15th, 2015, 01:22:09 AM IST


ప్రముఖ వార్తాపత్రిక డెక్కన్ క్రానికల్ చైర్మన్ వెంకట్రామిరెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. కాగా తమకు 357రూపాయల కోట్ల మేర నష్టం చేకూర్చారంటూ కెనెరా బ్యాంకు పిర్యాదు చెయ్యడంతో వెంకటరామిరెడ్డిని అరెస్ట్ చేసి సీబీఐ అధికారులు నాంపల్లి కోర్టుకు తరలించారు. కాగా శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతానికి వెంకట్రామిరెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు ముందుగా అతనిని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కు తీసుకెళ్ళి అనంతరం కోర్టులో హాజరు పరిచారు. ఇక బ్యాంకును మోసం చేసిన కేసులో వెంకట్రామిరెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది.