తెలుగు రాష్ట్రాల ప్రయాణికులపై ఢిల్లీలో ఆంక్షలు..!

Friday, May 7th, 2021, 03:00:15 AM IST

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృత్తి పెరుగుతున్న నేపధ్యంలో ఇప్పటికే అమలు చేస్తున్న ఆంక్షలను పలు రాష్ట్రాలు మరింత కఠినతరం చేస్తున్నాయి. అయితే తాజాగా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఢిల్లీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఏపీ, తెలంగాణల నుంచి ఢిల్లీకి వచ్చే వారు తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకుని ఉండాలని లేదంటే కరోనా నెగిటివ్ ఉంటే 7 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని, ఏ రిపోర్ట్ లేనట్టయితే 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని తెలిపింది. అయితే ఇప్పటికే భారీగా పెరుగుతున్న కేసులతో సతమవుతున్న ఢిల్లీ తెలుగు రాష్ట్రాల్లో కొత్త రకం కరోనా వేరియంట్ ఉందని, అది మరింత ప్రమాదకరమని భావిస్తున్న నేపథ్యంలో ఈ ఆంక్షలు విధిస్తున్నట్లు ఆ ప్రభుత్వం వెల్లడించింది.