మెట్రో రైల్ మార్పుపై అఖిలపక్షంలో నిర్ణయం

Thursday, November 27th, 2014, 12:08:25 PM IST


హైదరాబాద్ మెట్రో రైల్ అలైన్ మెంట్ విషయంపై త్వరలోనే అఖిలపక్షంలో చర్చిస్తామని తెలంగాణ ముఖ్యమనత్రి కెసిఆర్ అన్నారు. హైదరాబాద్ లో అనేక చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయని… వాటికి ఎటువంటి హాని కలుగనీయకుండా రైల్ మార్గం ఉండాలని..అందుకోసం మెట్రో రైల్ రూటు మార్పు విషయం అందరితో కలిసి చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ రోజు ఆయన ఈ విషయంపై అసెంబ్లీలో మాట్లాడారు.

గ్రీన్ ల్యాండ్స్ నుంచి జూబ్లిహిల్స్ వరకు మెట్రో రైల్ రూటు అంశం ప్రస్తుతం కోర్టులో ఉన్నదని ఆయన తెలిపారు. కోర్టు ఉత్తర్వులు అనంతరం దీనిపై తగిన నిర్ణయం తీసుకుంటామని కెసిఆర్ అన్నారు. ఇక సుల్తాన్ బజార్ ద్వంసం చేయబోబని ఆయన అన్నారు. సుల్తాన్ బజార్ ద్వసం చేయకుండా… రూటును ఉమెన్స్ కాలేజీవైపు గుండా వేస్తామని అన్నారు. ఇక పాతబస్తీలో ఇళ్ళకు కుల్చేవేయకుండా రైల్ మార్గం నిర్మించేవిధంగా తగిన చర్యలు తీసుకుంటామని కెసిఆర్ అన్నారు. దీనిపై త్వరలోనే అఖిలపక్షంలో చర్చిస్తామని కెసిఆర్ స్పష్టం చేశారు.