రివర్స్ లో ఏం జరుగుతుంది? ఆదానా..? అదనపు వ్యయమా? – దేవినేని ఉమా

Tuesday, April 20th, 2021, 12:17:04 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై మరొకసారి వరుస ప్రశ్నలు సంధించారు తెలుగు దేశం పార్టీ కీలక నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా. అయితే పోలవరం టెండర్ల లో అవినీతి జరిగింది అన్నారు, అంచనాలను పెంచేశారన్నారు, రివర్స్ టెండరింగ్ లో వందల కొట్లు ఆదా చేశామని ప్రచారం చేసుకున్నారు, కానీ గుట్టు చప్పుడు కాకుండా వేల కోట్లు అంచనాలు పెంచేశారు అంటూ దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. రివర్స్ లో ఏం జరుగుతుంది ఆదానా లేక అదనపు వ్యాయమా అంటూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిను సూటిగా ప్రశ్నించారు. అంతేకాక మరొక పోస్ట్ లో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

ఎన్నికల ముందు పోలవరం పునాదులు లేవలేదు అన్నారు, తెలుగు దేశం పార్టీ అధినేత, మాజి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 71 శాతం పనులు పూర్తి చేస్తే జరుగుతున్న పనులను ఆపారు అంటూ దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. రివర్స్ టెండరింగ్ అన్నారు, ఆదా అన్నారు, మొత్తం 3,222 కొట్లు అంచనా పెంచేశారు అంటూ చెప్పుకొచ్చారు. ఇసుకకు 500 కోట్ల రూపాయల అదనం అంటూ వివరించారు. అంతేకాక నిన్న ఒక్క రోజే 2,569 కొట్లు పెంచేశారు అని వ్యాఖ్యానించారు. ఈ మహా దోపిడీ పై ప్రజలకు సమాధానం చెప్పండి జగన్ గారు అంటూ సూటిగా ప్రశ్నించారు.