వివేకాది గుండెపోటు అని చెప్పిన విజయసాయి రెడ్డి పై కేసు పెట్టాలి – దేవినేని ఉమా

Monday, April 12th, 2021, 12:00:15 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పై, సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనా విధానం పై తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజి మంత్రి దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అరాచక, దుర్మార్గపు పాలన కొనసాగుతోంది దేవినేని ఉమా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నించే గొంతుక లను అణచి వేస్తున్నారు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ప్రతి అమావాస్య కి తెలుగు దేశం పార్టీ నేతల పై కేసులు పెడుతున్నారు అంటూ మండిపడ్డారు. అయితే తన పై సీఐడీ కేసు పెట్టడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పై ఎందుకు సీఐడీ కేసు పెట్టారు అంటూ నిలదీశారు. అయితే తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన దేవినేని ఉమా ఈ మేరకు అధికార పార్టీ వైసీపీ తీరు పై ధ్వజమెత్తారు.

తిరుపతి పై సీఎం అంతరంగాన్ని మీడియా కి చూపితే నాపై కేసులా అంటూ దేవినేని ఉమా అవేదన వ్యక్తం చేశారు. మార్ఫింగ్ చేశాను అంటూ తప్పుడు కేసులు బనాయిస్తారా అంటూ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారా అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే తప్పుడు కేసులు పెడితే భయపడేది లేదు అని వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి వివేకా ది గుండెపోటు అంటూ చెప్పుకొచ్చిన ఎంపీ విజయసాయి రెడ్డి పై కేసు పెట్టాలి అంటూ దేవినేని ఉమా డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పలు సమస్యల పై అధికార పార్టీ తీరును ఎండగట్టే దేవినేని ఉమా మరొకసారి వైసీపీ నేతల పై ఘాటు వ్యాఖ్యలు చేయడం పట్ల అధికార పార్టీ కి చెందిన నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.