ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ది కోసం సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యలేవి అని తెలుగు దేశం పార్టీ కీలక నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అడ్వాన్స్ స్థితిలో రోడ్లు, చేస్తున్న లక్షల కోట్ల అప్పు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అంటూ రాష్ట్ర ప్రభుత్వం ను సూటిగా ప్రశ్నించారు. సంపద సృష్టి చేతకాక, ఇలాంటి రోడ్లకు స్టేట్ టోల్ గేట్ కు పెడతారా అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే తాడేపల్లి రాజప్రసాదానికి కిలోమీటర్ రోడ్డుకి 5 కోట్ల రూపాయల ఖర్చు చేసిన మీకు ఒక్క ఛాన్స్ ఇచ్చిన ప్రజల రోడ్లు ఎందుకు కనిపించడం లేదు సీఎం జగన్ అంటూ దేవినేని ఉమా సూటిగా ప్రశ్నించారు.
అయితే అందుకు సంబంధించిన ఫోటలు సైతం దేవినేని ఉమా సోషల్ మీడియా ద్వారా ప్రజలతో పంచుకున్నారు. అయితే ప్రజల సమస్యల గురించి రాష్ట్ర సర్కార్ ను ప్రశ్నించే దేవినేని ఉమా మరొక్కసారి ఈ అంశం తో హాట్ టాపిక్ అయ్యారు. అంతేకాక ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరదల సమయం లో రోడ్లు పరిస్తితి మరింత దారుణంగా తయారైంది అంటూ అందరూ ఘాటు విమర్శలతో రాష్ట్ర ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో అద్వాన స్థితిలో రోడ్లు, చేస్తున్న లక్షలకోట్ల అప్పు ఎక్కడ ఖర్చుపెడుతున్నారు? సంపద సృష్టి చేతకాక..ఇలాంటి రోడ్లకి స్టేట్ టోల్ గేట్ లు పెడతారా? తాడేపల్లి రాజప్రసాదానికి కిలోమీటర్ రోడ్డుకి 5కోట్లు ఖర్చుచేసిన మీకు ఒక్కఛాన్స్ ఇచ్చిన ప్రజలరోడ్లు ఎందుకు కనిపించడంలేదు?@ysjagan pic.twitter.com/hZj1DU3hNx
— Devineni Uma (@DevineniUma) November 27, 2020