పవన్ హరీష్ శంకర్ ల సినిమా కి టైటిల్ అదేనా?

Friday, April 9th, 2021, 06:24:36 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వరుస సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ నేడు విడుదల అయిన సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ తన సినిమా టైటిల్స్ ను డిఫరెంట్ గా పెడుతున్నట్లు తెలుస్తోంది. పింక్ చిత్రం కి రీమేక్ గా వచ్చిన ఈ సినిమా కి వకీల్ సాబ్ అంటూ టైటిల్ పెట్టీ ఎక్కడా లేని క్రేజ్ సొంతం చేసుకున్నారు. అంతేకాక క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి హరిహర వీరమల్లు అంటూ ఒక పవర్ ఫుల్ టైటిల్ ను పెట్టీ ఇండస్ట్రీ దృష్టి ను ఆకర్షించారు. అయితే పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ తో ఒక సినిమా ను అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ఈ చిత్రం లో పవన్ లెక్చరర్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి టైటిల్ ఇదే అంటూ సోషల్ మీడియా లో, ఫిల్మ్ నగర్ లో ఒక వార్త చెక్కర్లు కొడుతుంది. అయితే పవన్ కళ్యాణ్ హరీశ్ శంకర్ ల కాంబో లో వస్తున్న చిత్రానికి టైటిల్ సంచారి అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే దీని పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం లో సినిమా వస్తుండటం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు. అయితే అయ్యప్పనం కోషీయం చిత్రం రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ప్రకటించలేదు.మరి దీని పై చిత్ర యూనిట్ త్వరలో ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.