ప్రభాస్ రోజుకి రెండు సార్లు వర్కౌట్లు చేస్తూ బిజీగా ఉంటున్నారు – ఓం రౌత్

Wednesday, February 24th, 2021, 03:52:46 PM IST

ఓం రౌత్ దర్శకత్వం లో రూపొందుతున్న ఆదిపురుష్ చిత్రం పాన్ ఇండియా మూవీ గా విడుదల కానున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆదిపురుష్ కథని సినిమా గా సిద్దం చేయడం ఎంతో క్లిష్టమైన వ్యవహారం అని ఓం రౌత్ అన్నారు. అయితే ఒక సినిమా గా తెరకెక్కించడం ఎంతో క్లిష్టమైన విషయం అని, అయితే తనతో పాటు ప్రపంచం లో ఉన్న ఎంతో మందికి ఈ చిత్రం అవసరం అని తెలిపారు. టెక్నాలజీ అనుసంధానం చేస్తూ ప్రేక్షకులకు ఈ కథ చెప్పనున్నాను అని వ్యాఖ్యానించారు. రామాయణం గురించి ఎంతోమందికి తెలుసు అని, ఎన్నోసార్లు వెండితెర పై చూశారు అని, అయితే ప్రేక్షకుల్ని థియేటర్ల కి తీసుకు వచ్చే విధంగా సినిమా తెరకెక్కించాలని అన్నారు. జీవితం లో ఎన్నో సందేహాలకు రామాయణం చదివినప్పుడు సమాధానం దొరికింది అని, ఆదిపురుష్ చూసి ప్రేక్షకుడు ఒక మంచి సందేశం తో ఇంటికి చేరుకోవాలి అని వ్యాఖ్యానించారు.

అయితే ఈ మేరకు ప్రభాస్ ను కలవడం కోసం హైదరాబాద్ ఒకసారి వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ముంబై కి ప్రభాస్ తనను కలవడానికి వచ్చిన విషయాన్ని వెల్లడించారు. అంతేకాక ఆదిపురుష్ చిత్రం కి సంబంధించిన డిస్కషన్స్ అన్ని కూడా ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ ద్వారా జరిగాయి అని అన్నారు. అయితే ప్రభాస్ పలు నైపుణ్యాలను నేర్చుకుంటున్నారు అని, అదే విధంగా రోజుకి రెండు సార్లు వర్కౌట్లు చేస్తూ బిజీ గా ఉంటున్నారు అని తెలిపారు.