హైదరాబాద్ లో ‘డిస్నీల్యాండ్’!

Monday, March 23rd, 2015, 03:08:56 PM IST


తెలంగాణ పర్యాటక సంస్థ కొత్త చైర్మన్ పేర్వారం రాములు హైదరాబాద్ లో టూరిజం కార్పోరేషన్ భవనంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో టూరిజం అభివృద్ధికి మరిన్ని నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. అలాగే హైదరాబాద్ లో డిస్నీల్యాండ్ ఏర్పాటు చేసి తద్వారా నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకు వస్తామని పేర్వారం రాములు స్పష్టం చేశారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ లండన్, ప్యారిస్ మాదిరిగా హైదరాబాద్ లో 600 అడుగుల జెయింట్ వీల్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే వినోదం కోసం యువత దూరప్రాంతాలకు వెళ్ళకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని రాములు తెలిపారు. ఇక భువనగిరి కొండ వద్ద పారా గ్లైడింగ్ ఏర్పాటు చేస్తామని, ఘాట్ కేసరి వద్ద చెరువులో బోటింగ్, ఫారెస్ట్, అడ్వంచర్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని పేర్వారం రాములు పేర్కొన్నారు.