బాబా రాంపాల్ బెయిల్ రద్దు!

Thursday, November 20th, 2014, 03:35:59 PM IST


వివాదాస్పద బాబా రాంపాల్ ను హర్యానా పోలీసులు ఎట్టకేలకు నిన్న అరెస్ట్ చేసి ఈ ఉదయం కోర్టులో హారజరు పరిచారు. అయితే… తాను నిర్దోషినని…తను ఎటువంటి నేరం చేయలేదని బాబా రాంపాల్ అన్నారు. తనను అనవసరంగా కేసులో ఇరికించారని … తనకు బెయిల్ ను మంజూరు చేయాలని ఈ రోజు ఆయన కోర్టుకు విన్నవించారు. అయితే.. బాబా రాంపాల్ విజ్ఞప్తిని హైకోర్ట్ తిరష్కరించినది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను తిరష్కరించినది.

బాబా రాంపాల్ పై అనేక కేసులు ఉన్నాయి. 2006లో ఒక హత్యకేసుకింద ఆయనకు ఇచ్చిన బెయిల్ ను సైతం కోర్టు రద్దు చేసింది. అనేకాకుండా… కోర్టు ఉత్తర్వులను ఖాతరు చేయకుండా… రగడ సృష్టించినందుకు ఆయనపై కోర్టు ధిక్కారం కేసును నమోదు చేశారు. ఈ కేసును ఈ రోజు మధ్యాహ్నం కోర్టు విచారించనున్నది.