రిటైర్మెంట్ ఏజ్ పెంచేది లేదు!

Thursday, November 20th, 2014, 03:31:17 PM IST


తెలంగాణ అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రశ్నోత్తరాల సందర్భంగా గురువారం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రభుత్వ ఉద్యోగాల కోసం యువకులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. అలాగే ఉద్యోగుల పదవీ విరమణ కాలాన్ని పెంచేది లేదని ఈటెల కచ్చితంగా చెప్పారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ నూతన రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఉద్యోగాలు వస్తాయని యువత ఆశతో ఉన్నారని, త్వరలోనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. అలాగే ఉద్యోగుల పదవీ విరమణ 58ఏళ్ళకే ఉంటుందని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.