ఈ ట్రంప్ మామూలోడు కాదు..!

Wednesday, May 4th, 2016, 12:13:20 PM IST


డోనాల్డ్ ట్రంప్.. గత కొంత కాలంగా తరచూ వినిపిస్తున్న పేరు. ఎందుకంటే అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేస్తున్న ట్రంప్ తన విభిన్నమైన, వివాదాస్పదమైన వైఖరితో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. ప్రతిసారీ అమెరికా అధ్యక్ష ఎన్నికలు వ్యాపారం, గన్ కల్చర్, గే మ్యారేజస్, ఇతర దేశాలతో సంబంధాలు వంటి ప్రధాన అంశాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కానీ ఈసారి ట్రంప్ రాకతో ప్రాంతీయతత్వం అనే అంశం తెరపైకి వచ్చింది.

ట్రంప్ తన ఉపన్యాసాలలో ఇతర దేశాలన్నీ కలిసి త,అ దేశాన్ని దోచుకుంటున్నాయని, అందుకు ప్రస్తుత పాలకుల అసమర్థ పాలనే కారణమని, అమెరికా తన వైభవాన్ని కోల్పోయి అందరికీ చులకన అయిందనీ అంటూ మన దేశం, మనదే అధికారం, మనమే ప్రపంచ పాలకులం అనే ధోరణిని కనబరుస్తూ జనాలను ఉద్వేగబరితం చేస్తూ తన వైపుకు తిప్పుకుంటున్నాడు. ఇతనికి పోటీగా డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. తాజాగా ట్రంప్ ఇండియానా ప్రైమరీ ఎన్నికల్లో గెలిచి అధ్యక్ష పోటీకి లైన్ క్లియర్ చేసుకున్నారు. ఆదిలోనే న్ని దేశాలను, అన్ని సున్నిత అంశాలను కెలికి రచ్చ రచ్చ చేసిన ట్రంప్ ఒకవేళ అధికారంలోకి వస్తే ప్రపంచ దేశాలలో పెను మార్పులు సంభవిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.