మటన్ కర్రి.. భార్య ప్రాణాలు తీసింది..!

Friday, December 25th, 2015, 12:18:43 PM IST

తినే కూర బాగాలేకపోతే.. బాగాలేదని చెప్పి తిరిగి వండించుకుంటాం. లేదంటే భార్యను రెండు తిట్లు తిట్టి బయట నుంచి తెచ్చుకొని తింటాం. అంతేకాని.. కట్టుకున్న భార్యను చంపుకుంటామా. చంపుకోలేం కదా. కాని, ఓ తాగుబోతు మాత్రం అదే పని చేశాడు. మటన్ కర్రీని రుచిగా వండలేదని చెప్పి భార్యతో తగాదా పెట్టుకున్నాడు. అక్కడితో ఆగకుండా, కోపంతో ఊగిపోయి భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించి పారిపోయాడు. ఈ సంఘటన హైదరాబాద్ లోని పద్మశాలిపురంలో జరిగింది. ఇక వివరాలలోకి వెళ్తే..

పద్మశాలిపురంలోని టిఎన్జీవోఎస్ కాలనీలో సులోచన.. శంకర్ రావు షిండే అనే దంపతులు నివశిస్తున్నారు. వీరికి 8 సంవత్సరాల సంతోష అనే బాలుడు కూడా ఉన్నాడు. అయితే, ఈనెల 20 వ తేదీన శంకర్ రావు మటన్ తీసుకొచ్చి వండమని చెప్పి.. బయటకు వెళ్లి మద్యం సేవించి వచ్చాడు. తిరిగి ఇంటికి వచ్చిన శంకర్ రావు.. మటన్ తిని.. షాక్ తిన్నాడు. మటన్ రుచిగా లేదని.. ఊగిపోయాడు. అక్కడితో ఆగకుండా.. ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించి.. అక్కడినుంచి పారిపోయాడు. అయితే, ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆమెను వెంటనే ఉస్మానియా హాస్పిటల్ లో చేర్చారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ.. గురువారం మరణించింది. భార్య మరణానికి కారణమైన శంకర్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు.