భూకంపం వచ్చినా.. ఇకపై హాయిగా నిద్రపోవచ్చట..!

Monday, December 21st, 2015, 04:30:18 PM IST


గత కొంతకాలంగా ప్రకృతి తన కోపాన్ని చూపిస్తున్నది. ఇటీవలే నేపాల్ లో వచ్చిన భూకంపం కారణంగా వేల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. భూకంపం వచ్చింది అంటే.. ఎంత పెద్ద చెట్టు కావొచ్చు.. బిల్డింగ్స్ కావొచ్చు పునాదులతో కూల్చేస్తుంది. మెలుకువతో ఉన్న సమయంలో భూకంపం వస్తే ఎలాగోలా తప్పించుకోవచ్చు. కాని, నిద్రపోయే సమయంలో వస్తే.. దానినుంచి బయటపడటం ఎలా.. నిద్రలో పైకప్పు మీదపడితే.. ఇంకేమున్నది. పరలోక యాత్రే. దీని నుంచి తప్పించుకోవడానికి ఇటీవలే చైనీయులు ఓ బెడ్ ను కనిపెట్టారు. దానిమీద పడుకుంటే చాలు.. భూకంపం వచ్చినా భయపడవలసిన అవసరం లేదట.

నిద్రపోతున్న సమయంలో భూకంపం కనుక వస్తే.. బెడ్ కాస్త అడుగునున్న పెట్టెలోకి జారిపోతుంది. ఇక అందులో ఆక్సీజన్ మాస్, సిలిండర్, ఫుడ్, మందులు, వాటర్ బాటిల్స్ ఇలా కొన్ని రోజులకు కావలసిన సరంజామా అంతా ఆ పెట్టెలో ఉంటుంది. ఇంతవరకు బాగానే ఉన్నది. అయితే, ఆ బాక్స్ లో నుంచి ఎలా బయటకు రావాలి అనే విషయాన్నీ మాత్రం చెప్పలేదు. ఏది ఏమైనా.. రెండు నిమిషాల నిడివి కలిగినటువంటి ఈ యానిమేషన్ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు హల్ చల్ చేస్తున్నది.

వీడియో కోసం క్లిక్ చేయండి