బొగ్గు స్కాంలో దాసరిని ప్రశ్నించిన ఈడీ!

Monday, December 8th, 2014, 06:34:25 PM IST


కేంద్ర మాజీమంత్రి, ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావును బొగ్గు కుంభకోణం కేసులో ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రశ్నించింది. కాగా కొన్నాళ్ళ పాటు దాసరి నారాయణరావు కేంద్ర బొగ్గు శాఖామంత్రిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపధ్యంగా బొగ్గు క్షేత్రాల కేటాయింపులో జరిగిన కుంభకోణాన్ని విచారిస్తున్న ఈడీ తాజాగా దాసరిని కూడా ప్రశ్నించినట్లు పీటీఐ సంస్థ తన తాజా కధనంలో పేర్కొంది.

ఇక బొగ్గు కుంభకోణంపై తాజాగా సుప్రీంకోర్టు కూడా స్పందించింది. కాగా ఈ కుంభకోణం కేసులో సీబీఐ దర్యాప్తు తీరును సుప్రీంకోర్టు ఆక్షేపించింది. ఇక 2015 ఫిబ్రవరి 5వ తేదీలోగా ఈ కేసుకు సంబంధించిన నివేదికను కోర్టుకు సమర్పించాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది.