తెరపై కనిపించిన వారు : సునీల్, సుష్మా రాజ్, రిచా పనాయ్
కెప్టెన్ ఆఫ్ ‘ఈడు గోల్డ్ ఎహే’ : వీరూ పోట్ల
మూలకథ :
బంగార్రాజు (సునీల్) ఎన్నో చోట్ల పనులు మానుతూ చివరికి హైద్రాబాద్‌లో ఓ పనికి ఫిక్సవుతాడు. అయితే అక్కడ అతణ్ణి ఎవరెవరో వెంబడిస్తూ ఉంటారు. ఇదంతా బంగార్రాజు జీవితాన్ని పూర్తిగా తలకిందులు చేస్తుంది. బంగార్రాజును ఎవరు, ఎందుకు వెంటాడతారు? వీటన్నింటి నుంచి బంగార్రాజు ఎలా బయటపడతాడు? అన్నదే సినిమా.
విజిల్ పోడు :
1. ట్విస్ట్‌లు చాలా ఉన్నాయీ సినిమాలో! ఆ ఒక్కో ట్విస్ట్ వచ్చినప్పుడల్లా విజిల్స్ వేస్తూ పోవచ్చు. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ ట్విస్ట్లైతే అదిరిపోయేలా ఉన్నాయి.
2. షకలక శంకర్ దొంగగా చేసే సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. అవి కడుపుబ్బా నవ్వించేలా ఉన్నాయి. దీనికి తోడు క్లైమాక్స్‌లో వచ్చే పృథ్వీ అడల్ట్ కామెడీకి అయితే తిరుగేలేదు. కోళ్ళ ఫారం అంటూ వచ్చే ఆ అడల్ట్ కామెడీ విజిల్స్ వేయిస్తుంది.
3. దక్షిణ మధ్య రైల్వే దబాంగ్ అంటూ వెన్నెల కిషోర్ చేసే కామెడీ కూడా అదిరింది. వెన్నెలకిషోర్ ఎండ్ కార్డ్ దగ్గర ఇచ్చే స్ట్రాంగ్ పంచ్ కూడా అదిరిపోయేలా ఉంది.
ఢమ్మాల్ – డుమ్మీల్ :
1. సునీల్ కామెడీ, క్యారెక్టరైజేషన్ రొటీన్ అయిపోయింది. ఎంతగా రొటీన్ అయిందీ అంటే, ‘మర్యాద రామన్న’ సినిమా పాత్రనే ఏళ్ళుగా చూస్తూ వస్తున్నట్లు. ఇకనైనా సునీల్ పంథా మారిస్తే మంచిది.
2. ఇక ట్విస్ట్‌లు పక్కనబెడితే సినిమాలో అసలు ఎలిమెంట్స్ అన్నవేవీ లేవు. ఒక నాలుగు ట్విస్ట్‌లు అక్కడక్కడా ఉన్నాయి, ఆ నాలుగు ట్విస్ట్‌లను అందుకునేలా సన్నివేశాలు రాస్తే చాలు అని అతికించినట్లున్నాయి అన్ని సన్నివేశాలూ..!
3. హీరోయిన్ల క్యారెక్టరైజేషన్, విలన్ క్యారెక్టరైజేషన్ లాంటివేవీ ఆకట్టుకునేలా లేవు. ముఖ్యంగా స్క్రీన్‌ప్లేలో ఏ సన్నివేశం ఎలా వస్తుందో తెలియని టైమ్‌లో ఈ క్యారెక్టర్స్ అన్నీ ఒక్కోటిగా వస్తూ విసుగు పుట్టిస్తాయి.
దావుడా – ఈ సిత్రాలు చూశారూ ..!!
–> పోసాని కృష్ణ మురళి రోల్ ఏంటో, ఆయన పాత్ర ఎందుకలా ప్రవర్తిస్తుందో అంతా అయోమయంగా ఉంటుంది. ఈ ట్రాక్ అంతా చిత్రంగానే కనిపించింది.
–> విలన్ రోల్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిది. కోట్ల రూపాయల బెట్టింగ్ నిర్వహించే ఆ విలన్ వేషాలన్నీ చిన్న వీధిరౌడీ వేషాల్లా ఉంటాయి. ఇదంతా చిత్రంగా చూస్తూండటమే!
–> చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితుల సంభాషణ ఇలా ఉంది..
మిస్టర్ ఏ : సునీల్ రొటీన్ అయినా, ట్విస్ట్‌లు భలే ఉన్నాయి కదరా..!
మిస్టర్ బీ : ఆ ట్విస్ట్‌లు తప్ప సినిమాలో ఏముందిరా?
మిస్టర్ ఏ : (సైలెంట్)