ప్రముఖ మహిళా కార్టూనిస్ట్ రాగతి పండరి మృతి!

Thursday, February 19th, 2015, 06:20:14 PM IST


ప్రముఖ మహిళా కార్టూనిస్ట్ రాగతి పండరి గురువారం కన్నుమూశారు. కాగా 50ఏళ్ళ రాగతి పండరి గత కొద్ది రోజులుగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ నేడు తుది శ్వాశ విడిచారు. ఇక శారీరకంగా పోలియో కారణంగా చలాకీగా తిరగలేకపోయినా మానసికంగా ధృఢ నిశ్చయంతో పలు కార్టూన్లను గీసి బాపు, జయదేవ్, బాబు వంటి అగ్రగణ్యుల పక్కన నిలబడిన ప్రతిభాశాలి రాగతి పండరి. అలాగే వ్యంగ్య చిత్ర కళారంగంలో చాలా మంచి పేరు తెచ్చుకుని కార్టూనిస్ట్ గా కీర్తి ప్రతిష్టలను ఆర్జించుకున్న ఏకైక మహిళ ఆమె. ఇక రాగతి పండరి అవయవాలను సావిత్రిభాయ్ పూలే మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఆమె కుటుంబ సభ్యులు దానం చేసినట్లు తెలిపారు.