బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌తో ఈటల రాజేందర్ భేటీ..!

Wednesday, May 12th, 2021, 06:04:39 PM IST

భూ కబ్జా ఆరోపణల కారణంగా ఈటల రాజేందర్‌ను సీఎం కేసీఆర్‌ను మంత్రి పదవి నుంచి భర్తరప్ చేసిన చేసిన సంగతి తెలిసిందే. అయితే మాజీ మంత్రి ఈటల కొత్త పార్టీ పెట్టే యోచనలో కనిపిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఈ నేపధ్యంలోనే పలువురు పార్టీల నేతలతో ఈటల వరుస భేటీలు అవుతున్నారు. నిన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కలిసిన ఈటల తన రాజకీయ భవిష్యత్తు గురుంచి చర్చించారు.

అయితే నేడు ఉదయం రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్‌తో భేటీ అయ్యి తన రాజకీయ భవిష్యత్తు గురుంచి చర్చించారు. త్వరలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని, తన పోరాటానికి మద్ధతు ఇవ్వాలని కోరినట్టు ఈటల తెలిపాడు. అనంతరం బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌తో కూడా ఈటల సమావేశమైనట్టు తెలుస్తుంది. అయితే అసలు ఈటల రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నది ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారింది.