20 ఏళ్ల ఉద్యమ ఘట్టాలను కొందరు గుర్తు చేశారు – ఈటెల రాజేందర్

Wednesday, May 5th, 2021, 03:10:39 PM IST


తెలంగాణ రాష్ట్రం లో మాజి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మీడియా సమావేశం లో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే తనకు జరిగిన అన్యాయం భరించరానిది అని కార్యకర్తలు అభిప్రాయ పడ్డారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే హుజూరాబాద్ లో పలువురు నేతలతో, కార్యకర్తలతో ఈటెల రాజేందర్ సమావేశం అయ్యారు. అయితే తనను ఈ స్థాయి కి తీసుకు వచ్చిన వారి అభిప్రాయాలను తెలుసుకున్నాను అని వ్యాఖ్యానించారు. ఉద్యమానికి ఊపిరినిచ్చిన ప్రాంతం హుజూరాబాద్ అంటూ చెప్పుకొచ్చారు.

అయితే రాష్ట్రంలోని అనేక నియోజక వర్గ ఉద్యమ కారులు అంతా సూచనలను ఇచ్చారు అని తెలిపారు. 20 ఏళ్ల ఉద్యమ ఘట్టాలను కొందరు గుర్తు చేశారు అని అన్నారు. అయితే తాను ఏ నిర్ణయం తీసుకున్నా తన వెంటే కార్యకర్తలు ఉంటామని భరోసా ఇచ్చిన విషయాన్ని వెల్లడించారు. అయితే ఉమ్మడి కరీం నగర్ నుండి మాత్రమే కాకుండా, ఖమ్మం సహా 9 జిల్లాల నుండి తనను పరామర్శించేందుకు కార్యకర్తలు వచ్చారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే హైదరాబాద్ వెళ్లి అక్కడి శ్రేయోభిలాషులతో చర్చించాల్సి ఉందని ఈటెల రాజేందర్ అన్నారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మంత్రి పదవీ భర్తరఫ్ చేసినప్పటి నుండి తెలంగాణ రాష్ట్రం లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారిన సంగతి అందరికీ తెలిసిందే.