సిఎల్పీ నేత భట్టి విక్రమార్క తో భేటీ అయిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్

Tuesday, May 11th, 2021, 04:37:27 PM IST

Etela_Rajendar

తెలంగాణ రాష్ట్రం లో ఈటెల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో మంత్రి పదవి నుండి సీఎం కేసీఆర్ భర్తరఫ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈటెల రాజేందర్ సొంత నియోజక వర్గం అయిన హుజూరాబాద్ లోని కార్యకర్తలు మరియు కీలక నేతల తో భేటీ అయి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అయితే హైదరాబాద్ వచ్చిన మాజి మంత్రి ఈటెల రాజేందర్ పలువురు ప్రముఖుల తో చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యం లో సిఎల్పీ నేత భట్టి విక్రమార్క తో ఈటెల రాజేందర్ భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని భట్టి నివాసం లో భేటీ అయ్యారు. అయితే ప్రస్తుతం రాష్ట్రం లోని రాజకీయాల పరిస్థితుల పై చర్చ జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే హుజూరాబాద్ లో తెరాస పార్టీ సైతం బలోపేతం అయ్యేందుకు సన్నాహాలు చేస్తుంది. అయితే ఈటెల రాజేందర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.