ఏ నిర్ణయం తీసుకున్నా అండగా ఉంటాం.. ఈటలకు మాజీ ఎంపీ మద్ధతు..!

Friday, May 7th, 2021, 02:00:02 AM IST

తెలంగాణలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు రోజు రోజుకు మద్ధతు పెరిగిపోతుంది. ఒకప్పుడు టీఆర్‌ఎస్‌లో ఈటలతో కలిసి పని చేసిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి నేడు ఈటలను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి ఈటల భార్య జమున తనకు బంధువు అని, ఈటల నా మిత్రుడని, రాజకీయ నాయకుడిగా ఈటల నివాసానికి వెళ్లలేదని, ఎలాంటి రాజకీయాలు మాట్లాడలేదని చెప్పుకొచ్చారు.

అయితే కేసీఆర్ తప్పుడు నిర్ణయాలు చాలాసార్లు తీసుకున్నారని ఆరోపించారు. పార్టీ నమ్ముకుని ఉంటే బయటకు పంపించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈటలకు ఏ మాత్రం నష్టం లేదని ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతుగా ఉంటామని ప్రకటించారు. ఇదిలా ఉంటే కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. 2018 ఎన్నికల్లో చేవెళ్ల నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం జరిగిన పరిణామాలతో ఆయన కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చి ప్రస్తుతం ఏ పార్టీలో చేరలేదు. అయితే కొండా, ఈటల భేటీ చూశాక తెలంగాలో రాజకీయాలు మరింత మారే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి.