కరోనా తో మృతి చెందిన ప్రముఖ యూ ట్యూబ్ యాంకర్ టిఎన్ఆర్

Monday, May 10th, 2021, 11:48:45 AM IST


కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత దేశం లో కొనసాగుతూనే ఉంది. అయితే ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే పలువురు ప్రముఖులు, సినీ రంగానికి చెందినవారు, రాజకీయ నాయకులు తమ ప్రాణాలను విడిచారు. అయితే తాజాగా ప్రముఖ యూ ట్యూబ్ యాంకర్, జర్నలిస్ట్, నటుడు టీఎన్ఆర్ కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. యూ ట్యూబ్ వేదిక గా ఎంతో మంది టాలీవుడ్ పరిశ్రమ కి చెందిన ప్రముఖులను ఇంటర్వ్యూ చేశారు టీ ఎన్ ఆర్. నటుడు గా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్న టీ ఎన్ ఆర్ అసలు పేరు తుమ్మల నరసింహ రెడ్డి. తన ఇంటర్వ్యూ లలో ప్రముఖులకు సంధించే ప్రశ్నలు వినూత్నంగా ఉండటం మాత్రమే కాకుండా, నెటిజన్ల ను సైతం అలోచింప జేసేలా ఉంటాయి. అయితే టి ఎన్ ఆర్ మృతి పట్ల సినీ పరిశ్రమ కి చెందిన పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్లు సైతం సోషల్ మీడియా వేదిక గా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.