థియేటర్ యజమానులకు తప్పని వేటు!

Thursday, March 5th, 2015, 04:24:32 PM IST


తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం హైదరాబాద్ లో వాణిజ్య పన్నుల శాఖలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమా హాల్స్ యజమానులు పన్నులు చెల్లించడంలేదని వారిని వదిలిపెట్టమని హెచ్చరించారు. అలాగే హైదరాబాద్ పరిధిలోని వస్త్ర, కార్పోరేట్, బంగారు షాపుల వ్యాపారాలు కూడా పన్నులు ఎగ వేస్తున్నారని తలసాని మండిపడ్డారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ ప్రజలు తెలంగాణ ప్రభుత్వానికి పన్నులు చెల్లించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అలాగే పన్నులు కట్టని వ్యాపారుల వివరాలు తెలిపిన వారికి తగిన పారితోషకాన్ని అందిస్తామని తలసాని తెలిపారు. ఇక సినిమా రంగంలో అందిస్తున్న నంది పురస్కారాల పేరు మార్పుకు త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.