వీడెవడండి బాబు.. సూర్యుడిపైనే కేసుపెట్టాడు..!?

Wednesday, June 8th, 2016, 10:26:42 AM IST


ప్రపంచానికి వెలుగును ప్రసాదించే సూర్యుడు లేకపోతే జీవం మనుగడ ఉండదు. ఎందుకంటే సృష్టిలో వెలుగు అవసరం ఎంతో ఉన్నది. ఇక ఇదిలా ఉంటె, భూమి దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుంది. ఇలా దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరిగే సమయంలో భూమి సూర్యుడికి దగ్గరిగా వస్తుంది. అలా సూర్యుడికి దగ్గరిగా వచ్చేకాలాన్ని ఎండాకాలం అంటాం. అయితే, మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా మార్పులు భూమిపై వేడి పెరిగిపోతున్నది. అలా వేడి పెరగడంతో.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

అయితే, వెలుగులు ప్రసాదించే సూర్యుడు.. తన ప్రతాపాన్ని చూపించడంతో.. మే నెలలో ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. రాజస్తాన్ లోని ఫలోడిలో మే 19 వ తేదీన 51 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఇంట మొత్తంలో ఉష్ణోగ్రత నమోదు కావడంతో.. ఫలోడి చిన్నపిల్లలు, ముసలి, ముతకా, మూగప్రాణులు విలవిలలాడి పోయాయాట. అదే రోజున మధ్యప్రదేశ్ నుంచి ఫలోడి కి వెళ్ళిన శివరాజ్ పాల్ సింగ్ అనే వ్యక్తి ఆ ఎండను చూసి మండిపడ్డాడు. అక్కడితో వదలకుండా.. ప్రాణుల్ని హింసిస్తున్న సూర్యుడిపై కేసు పెట్టాడు. సూర్యుడిని కఠినంగా శిక్షించాలని పేర్కొన్నాడు. ఇప్పుడు ఈ న్యూస్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. సూర్యుడిపై కేసు పెట్టడం ఏమిటని కొందరు వాపోతుంటే.. అసలు సూర్యుడిని ఎలా శిక్షిస్తారని మరికొందరు అంటున్నారు. మొత్తానికి శివరాజ్ పాల్ సింగ్ కేసు దేశంలో సంచనలం సృష్టించింది.