ఐదువేల సౌరవిధ్యుత్ సాధనే లక్ష్యం : పల్లె రఘునాథ్ రెడ్డి

Monday, February 2nd, 2015, 07:27:14 PM IST

palle-raghunatha-reddy
ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రుల క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనేక విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. క్యాబింట్ మీటింగ్ అనంతరం ఏపి ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సమైక్య ఉద్యమంలో పెట్టిన కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకుంటున్నట్టు పల్లె రఘునాథ్ రెడ్డి తెలియజేశారు. సమైక్య ఉద్యమంలో మొత్తం 187 కేసులు నమోదు అయ్యాయని, ఇక, అందులో 181 కేసులను ప్రభుత్వం ఎత్తివేసిందని… మరో ఆరు కేసులు పరిశీలనలో ఉన్నట్టు పల్లెరఘునాథ్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇక విధ్యుత్ పై తీసుకున్న నిర్ణయాలను కూడా ఆయన మీడియాతో తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కేవలం 127మెగావాట్ల సౌరవిధ్యుత్ మాత్రమే ఉన్నదని, రాబోయే ఐదు సంవత్సరాలలో ఐదువేల మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పాదన లక్ష్యంగా పెట్టుకున్నట్టు పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు. సౌర, పవన విధ్యుత్ కలిపి మొత్తం 9 వేల మెగావాట్ల విధ్యుత్ సాధనే లక్ష్యంగా పెట్టుకున్నట్టు పల్లె రఘునాథ్ రెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు.