గేదెను డీ కొట్టిన విమానం

Friday, November 7th, 2014, 04:45:43 PM IST


మరో పదిసెకన్లలో విమానం టేకాఫ్ అవుతుంది అనగా… రన్ వే పై అనూహ్యంగా ఆగిపోయింది. విమానం సడెన్ గా ఆగిపోవడంతో… ప్రయాణికులు ఆందోళన చెందారు. తీరా అసలు విషయం తెలిసి.. ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన గుజరాత్ లోని సూరత్ లో జరిగింది. ఇక వివరాలలోకి వెళ్తే..
సూరత్ నుంచి 140మంది ప్రయాణికులతో బయలుదేరిన స్పైస్ జెట్ విమానం రన్ వే మీద గేదెను డీకొట్టడంతో సడెన్ గా ఆగిపోయింది. విమానాశ్రయం ప్రహరీగోడ కోతమేరకు దెబ్బతినడంతో.. బయటి పొలాలలో గేదెలు అప్పుడప్పుడు..ప్రహరీగోడ దాటుకొని.. లోపలికి వస్తుంటాయి. అలాగే లోపలికి వచ్చిన గేదె…రన్ వేపైకి వచ్చింది…. గేదె రన్ వే మీదకు వచ్చిన విషయాన్ని పైలట్ దగ్గరికి వచ్చాకగాని గుర్తించలేదు. వెంటనే.. విమానాన్ని ఆపేశాడు. కాని..అప్పటికే.. గేదెను విమానం డీకొట్టింది.