సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించిన కేంద్ర మాజీ మంత్రి..!

Saturday, May 8th, 2021, 07:51:43 AM IST

ఏపీ సీఎం జగన్‌పై కేంద్ర మాజీ మంత్రి, బాలీవుడ్‌ నటుడు శతృఘ్నసిన్హా ప్రశంసలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనాకు ఉచితంగా వైద్యం అందిస్తుండడం నిజంగా ప్రశంసించదగ్గ విషయమని అన్నారు. సీఎం జగన్‌ ఎంతో దూరదృష్టితో ఆలోచించి రాష్ట్రంలో కరోనా చికిత్సను ఉచితంగా అందిస్తున్నారని, ఇది నిజంగా సాహసోపేతమైన నిర్ణయమని ఆయన అన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఇది ప్రజలకు చాలా అవసరమని, దీనిని ఆదర్శంగా ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని, ఈ విషయంలో మిగతా రాష్ట్రాలు కూడా సీఎం జగన్ బాటలో నడవాలని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పుకొచ్చాడు.