విశాఖ ఉక్కు పై పవన్ కళ్యాణ్ స్పందించాలి – గంటా శ్రీనివాస రావు

Tuesday, March 9th, 2021, 12:13:22 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లోని విశాఖ ఉక్కు పరిశ్రమ ను ప్రైవేటీకరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల మాజి మంత్రి, తెలుగు దేశం పార్టీ నేత గంటా శ్రీనివాస్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం వైఖరి పై ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా చెప్పారు అని అన్నారు. రాష్ట్రంలోని పెద్దలు ఏం జరగలేదు అని తప్పుదోవ పట్టించారు అంటూ ఆగ్రహ వ్యక్తం చేశారు. అంతేకాక రాష్ట్రానికి కేంద్ర ఆర్ధిక మంత్రి సమాచారం అందిస్తున్న విషయాన్ని వెల్లడించారు. అయితే ప్రైవేటీకరణ పై ఆర్ధిక మంత్రి ముగిసిన అధ్యాయం అని అన్నారు అని తెలిపారు.అయితే సీఎం తో కలిసి పని చేస్తామని చంద్రబాబు కూడా చెప్పారు అన్న విషయాన్ని గుర్తు చేశారు.

అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉపసంహరణ కొరకు బీజేపీ నేతలు ప్రధాన పాత్ర పోషించాలి అంటూ చెప్పుకొచ్చారు. అయితే ప్రధాని తో అపాయింట్ మెంట్ లో సీఎం ఎందుకు ప్రస్తావించలేదు అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే ఢిల్లీ లో పాదయాత్ర కి మేము సిద్దం అందరూ కలిసి రావాలి అంటూ చెప్పుకొచ్చారు. అయితే విశాఖ ఉక్కు పై పవన్ కళ్యాణ్ స్పందించాలి అని, కార్మికుల తరపున పవన్ కళ్యాణ్ పోరాడాలి అంటూ గంటా శ్రీనివాస్ రావు వ్యాఖ్యానించారు. అయితే రాష్ట్ర మంత్రులు రాజీనామా చేస్తే కచ్చితంగా ఫలితం ఉంటుంది అని తెలిపారు. రాజీనామా చేస్తే తెలుగు దేశం పార్టీ పోటీ పెట్టదు అని, కార్యాచరణ ప్రణాళిక ను సీఎం జగన్ ప్రకటించాలి అని కోరుతున్నా అంటూ చెప్పుకొచ్చారు.