అభద్రతాభావం అవాస్తవం

Monday, September 15th, 2014, 03:09:44 PM IST


హైదరాబాద్ లో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని, హైదరాబాద్ లో సీమాంద్రులు ఎటువంటి భయాందోళనలకు గురికావలసిన అవసరంలేదని..తెలుగురాష్ట్రాల గవర్నర్ నరసింహన్ అన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు ఆయన కేంద్ర విమానయాన శాఖమంత్రి అశోక్ గజపతిరాజుతో భేటి అయ్యారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండురాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుచూపుతో ముందుకు వెళ్తున్నారని అన్నారు. విభజన చట్టంలోని 9,10 సెక్షన్లలో ఎలాంటి వివాదం లేదని.. అంటూనే.. ఈ రెండు సెక్షన్లపై మరింత స్పష్టత రావాలని గవర్నర్ పేర్కొన్నారు.