తెలంగాణ సర్కార్‌ను మరోసారి ప్రశ్నించిన హైకోర్ట్..!

Thursday, July 30th, 2020, 04:26:32 PM IST

తెలంగాణ ప్రభుత్వానికి గత కొద్ది రోజులుగా హైకోర్ట్ షాక్‌లు ఇస్తూనే ఉంది. అయితే తాజాగా హైకోర్ట్ మరోసారి తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిలోఫర్ ఆస్పత్రిలో భోజనం సరఫరా చేసే కాంట్రాక్టర్ అక్రమాలపై విచారణ జరిపిన హైకోర్ట్ కమిటీ నివేదిక ఇచ్చి 5 నెలలైనా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించింది.

అయితే నిలోఫర్ ఆస్పత్రిలో భోజనం సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్‌పై ఎందుకంత ప్రేమ అని ప్రభుత్వాన్ని నిలదీసింది. ప్రభుత్వం కాంట్రాక్టర్ సురేష్ కుమార్‌ను వెనకేసుకొస్తున్నట్టు ఉందని, కమిటీల నివేదికలపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. గాంధీ, ఛాతీ ఆస్పత్రుల్లో కూడా కాంట్రాక్టర్ సురేష్‌కుమార్ పనితీరును పరిశీలించాలని దీనిపై ఆగష్ట్ 17లోపు సరైన నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది.