తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Monday, June 29th, 2020, 12:53:46 PM IST

గత కొద్ది నెలలుగా సచివాలయం ను కూల్చివేసి దాని ప్లేస్ లో కొత్తగా సచివాలయం ను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలు చేస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ కి చెందిన కొందరు నేతలు, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మరికొందరు ఈ కూల్చివేత సరైనది కాదు అని వ్యాఖ్యానించారు. హైకోర్టు లో సైతం పిటిషన్ లో వెయ్యడం జరిగింది. అయితే రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం నేడు సచివాలయం కూల్చివేత పై తుది నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల జోక్యం చేసుకోలేం అని, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తో ఏకుభవించింది. మంత్రి మండలి తీసుకున్న నిర్ణయం ను తప్పుబట్టలేం అని తెలిపింది. కాగా సచివాలయం ను కూల్చి వేయోద్దు అంటూ దాఖలైన పిటిషన్ లను కోర్టు కొట్టి వేయడం జరిగింది. వందల కోట్ల రూపాయల ప్రజా ధనం దుర్వినియోగం అవుతుంది అని పిటిషన్ వేసిన వారు వాదన వినిపించగా, ప్రస్తుతం ఉన్న పాత సచివాలయం లో సరైన వసతి సౌకర్యాలు లేవని, భావనలు సైత్ శిథిలావస్థకు చేరుకున్నాయి అని న్యాయస్థాానికి పూర్తిగా వివరించారు.

అయితే సచివాలయ నిర్మాణానికి ప్రస్తుతం ఉన్న అడ్డంకులు అన్ని తొలగిపోవడం తో రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉంటున్న సిబ్బందిని ఖాళీ చేయాలని, అందులోని కి ఎవరిని అనుమతించ కూడదు అని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాక కొత్త సచివాలయం నిర్మాణానికి సంబంధించిన పనులు ఇక వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.