ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల వెల్లడికి హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్

Friday, May 7th, 2021, 12:46:39 PM IST

High_court
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. అయితే ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల వెల్లడికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా వైరస్ నిబంధనలను పాటిస్తూ లెక్కింపు ప్రక్రియ చేపట్టాలని కోరింది. అయితే ఏలూరు పరిదిలో వార్డుల విభజన, ఓటర్ల జాబితా లో గందరగోళ పరిస్తితి నెలకొంది అని చెబుతూ ఎన్నికలని నిలిపి వేయాలి అంటూ గతం లో పలువురు హైకోర్ట్ ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

అయితే దీని పై సింగిల్ జడ్జి విచారణ చేపట్టి ఎన్నికలు నిలిపి వేయాలని ఆదేశించారు. అయితే ప్రభుత్వం డివిజన్ బెంచ్ కి అప్పీల్ కి వెళ్ళింది. అయితే ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అని అన్నారు.అయితే ఫలితాలు మాత్రం వెల్లడించవద్దు అని చెప్పుకొచ్చారు. అయితే తాజాగా దీని పై విచారణ చేపట్టగా ఎన్నికల ఫలితాలకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.