సెలబ్రిటీలకు ఇస్తారు గాని రైతులకు ఇవ్వరా?

Monday, December 22nd, 2014, 07:02:14 PM IST


తెలంగాణలో రైతుల ఆత్మహత్యల నేపధ్యంగా దాఖలైన పిటీషన్ పై హైకోర్టు నేడు విచారణను చేపట్టింది. ఈ సందర్భంగా ‘సెలబ్రిటీలకు డబ్బులు ఇస్తున్నారు. వినోడంపై ఖర్చు పెడుతున్నారు. అదే ఆకలి తీర్చే అన్నదాతలను ఆదుకోలేరా?’ అంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని కోర్టు సూటిగా నిలదీసింది. అలాగే రైతులు ఆత్మహత్యలకు పాల్పడకుండా సమగ్ర విధానాన్ని రూపొందించాలని తెలంగాణ ప్రభుత్వానికి కోర్టు సూచించింది. ఇక రెండు వారాలలోగా పిటీషన్ పై కౌంటర్ దాఖలు చెయ్యాలని హైకోర్టు ఆదేశించింది. కాగా గతంలో ఇలాంటి పిటీషన్ పై కౌంటర్ వేశామని ప్రభుత్వ న్యాయవాది తెలుపగా రెండు కేసులను ఒకేసారి విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.