ప్రైవేటు ఆసుపత్రులు ప్రభుత్వానికి సహకరించాలి – మేకతోటి సుచరిత

Wednesday, April 21st, 2021, 07:36:44 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే కరోనా వైరస్ నియంత్రణ విషయం లో హోం మంత్రి మేకతోటి సుచరిత జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే ఈ మేరకు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ మహమ్మారి పేరుతో ఎక్కువ డబ్బులు వసూలు చేసే ప్రైవేట్ ఆసుపత్రుల పై మంత్రి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రైవేట్ ఆసుపత్రులు కరోనా వైరస్ పేరుతో ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే చూస్తూ ఊరుకోం అని వ్యాఖ్యానించారు. అయితే ప్రభుత్వం సూచించిన రేట్లు మాత్రమే అమలు చేయాలి అంటూ చెప్పుకొచ్చారు. అయితే పేషంట్లు ఆసుపత్రి లో చేరగానే మూడు లక్షలు, నాలుగు లక్షలు కట్టండి అంటూ ఎలా అంటూ తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు.

అయితే ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు మానవత్వం తో వ్యవహరించాలి అని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వానికి సహకరించాలి అని వ్యాఖ్యానించారు. డబ్బులు సంపాదించి ఏమి చేసుకుంటాం, పోయేటప్పుడు కూడా ఏమీ తీసుకు వెళ్ళం కదా అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ మహమ్మారి ను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.