అక్కడ గాలి పీల్చుకోవాలంటే డబ్బులు కట్టాల్సిందే..!

Wednesday, December 16th, 2015, 02:58:29 PM IST


ప్రపంచలో ప్రతిదీ వ్యాపార వస్తువైన ఈ రోజుల్లో మనిషికి ఏ ఖర్చూ లేకుండా దొరికేది పీల్చుకునే గాలి మాత్రమే. కానీ ఇప్పుడు ఆ గాలిని కూడా గంటకింతని రేటు కట్టి అమ్మేస్తున్నారు. ఇది మరీ దారుణం కదూ. చైనాలోని జియాంగ్జూ రాష్ట్రంలో ఓ హోటల్ ఇలాంటి పనే చేస్తోంది. ఆ హోటల్లో తినడానికి వచ్చే వారికి తినడానికి వేసే బిల్లుతో పాటు అక్కడ కూర్చొని గాలి పీల్చుకున్నందుకు ఒక యువాన్ అంటే ఇండియన్ కరెన్సీలో రూ.10 బిల్లు కూడా వేస్తున్నారు. ఆ బిల్లుని చూసిన కస్టమర్లంతా పీల్చిన గాలికి బిల్లేమిటని ఆశ్చర్యపోయారు.

ఇదే విషయంపై హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా కలుషితమైన గాలిని శుబ్రం చేసి అందించడానికి కావాల్సిన ప్యూరిఫయర్లను చాలా డబ్బు ఖర్చు పెట్టి ఏర్పాటు చేశాం. అందుకే గాలిపై ఈ చార్జ్ అని వింత సమాధానం చెప్పారు. దీంతో కస్టమర్లు స్థానిక పోలీసులకు ఈ గాలి దోపిడీ గురించి చెప్పగా వాళ్ళు గాలి పీల్చచటం పై వసూలు చేస్తున్న చార్జీలను ఆపేయాలని హోటల్ యాజమాన్యాన్ని హెచ్చరించారు.