లాక్ డౌన్ ప్రకటన తో మద్యం దుకాణాల ముందు భారీ క్యూలు!

Tuesday, May 11th, 2021, 07:42:50 PM IST


తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉండటం తో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుండి పది రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే లాక్ డౌన్ ప్రకటన తో రాష్ట్రం లోని మద్యం దుకాణాల వద్ద భారీగా క్యూలు కనిపిస్తున్నాయి. కొన్ని మద్యం షాపుల ముందు కిలో మీటర్ల దూరం లో క్యూ లు కనబడుతున్నాయి. అయితే మందు షాపుల వద్ద కనీసం భౌతిక దూరం కూడా పాటించడం లేదు. మాస్క్ లు సైతం ధరించడం లేదు. అయితే మందు షాపు లకు సంబందించిన యాజమాన్యం రద్దీ తగ్గించే ప్రయత్నం చేస్తోంది. సామాజిక దూరం పాటిస్తూ, మాస్క్ లు ధరించేలా చర్యలు తీసుకుంటోంది. అయితే మహా నగరం అయిన హైదరాబాద్ లోని అన్ని చోట్ల మద్యం దుకాణాల వద్ద భారీ గా రద్దీ కనబడుతోంది. రేపటి నుండి ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే అత్యవసర సేవల కోసం లాక్ డౌన్ మినహాయింపు వర్తిస్తుంది.