హైదరాబాద్ లో లాక్ డౌన్ భయం తో సొంత ఊర్లకు జనం!

Tuesday, June 30th, 2020, 09:17:17 AM IST

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశం లో హెల్త్ ఎమర్జెన్సీ నడుస్తుంది. రోజుకి వేల సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మృతుల సంఖ్య మనం చూస్తున్నాం. అయితే ఈ లెక్కలు ఇపుడు అపుడే ఆగేలా కనిపించడం లేదు. అంతేకాక హైదరాబాద్ లో ఇపుడు పరిస్థితి మరింత దారుణంగా ఉందని చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం లో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎక్కువ కేసులు ఇక్కడి నుండి నమోదు అవుతున్నాయి.

అయితే రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో హైదరాబాద్ ను పూర్తి స్థాయిలో లాక్ డౌన్ అమలు చేసేందుకు చర్చలు జరుపుతున్నారు. నేటికీ వంద రోజుల లాక్ డౌన్ పూర్తి అయింది. మార్చ్ 22 న జనతా కర్ఫ్యూ ప్రకటిచిన నరేంద్ర మోడీ, ఆ తర్వాత రోజు నుండి పూర్తి స్థాయిలో దేశంలో లాక్ డౌన్ ప్రకటన చేశారు. కొన్ని సడలింపు లతో మొత్తానికి వంద రోజుల లాక్ డౌన్ ను పూర్తి చేశాం. అయితే హైదరాబాద్ లాంటి మహా నగరం లో లాక్ డౌన్ భయం తో ప్రజలు సొంత ఊర్లకు వెళ్తున్నారు.

ఇప్పటికే వివిధ రకాల ప్రయాణాల ద్వారా తమ సొంత ఊళ్లకు ప్రయాణం అయ్యారు. అక్కడే ఉండే వారు తమకి కావాల్సిన నిత్యావసరాలను, మందులను ఇంకా పలు సామగ్రి ను ముందుగానే తెచ్చుకుంటున్నారు. అయితే ఈసారి ఎక్కువగా కేసులు నమోదు కావడం చేత లాక్ డౌన్ మరింత కఠినంగా ఉండే అవకాశం ఉందని ప్రజలు భావిస్తున్నారు. లాక్ డౌన్ భయం తో ప్రజలు సొంత ఊర్లకు ప్రయాణం కావడం తో సిటీ లి రద్దీ మరొకసారి పెరిగింది.