చిన్న రోలైనా చెర్రీకి ఇష్టమేనట!

Wednesday, May 13th, 2015, 07:05:48 PM IST


కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం, స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో త్వరలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి నిర్మాతగా టాలీవుడ్ యంగ్ హీరో, చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ ఇది పూర్తి యాక్షన్, ఎంటర్ టైన్మెంట్, ఫ్యామిలీ చిత్రమని తెలిపారు. అలాగే తాను ముందే చిత్ర కధను విన్నానని, సినిమాను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఒక బృందం ఉందని చెర్రీ చెప్పాడు.

చరణ్ ఇంకా మాట్లాడుతూ నిర్మాతగా తన తొలి సినిమాకు దర్శకత్వం వహించేందుకు పలువురు ఒత్తిడికి గురయ్యారని, పూరి జగన్నాధ్ ఒక్కడే కాన్ఫిడెంట్ గా ఉన్నారని తెలిపాడు. అలాగే పూరీకి కధపై మంచి పట్టు ఉందని, కచ్చితంగా ఇది మంచి చిత్రం అవుతుందని చెర్రీ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక ఈ చిత్రంలో తనకు చిన్న గెస్ట్ రోల్ దొరికినా అది తన అదృష్టమేనని చరణ్ పేర్కొన్నాడు.