ఐ.డి.ఆర్.బి.టి. డైరెక్టర్. రామశాస్త్రికి జ్ఞాపికగా ‘ పురాణపండ ‘ నన్నేలు నాస్వామి ‘

Sunday, March 15th, 2020, 02:39:38 AM IST

చెన్నై : మార్చి : 14

ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ కఠోరమైన దీక్షతో అందించిన అపురూప మహాగ్రంధమైన ‘ నన్నేలు నా స్వామి ‘ రాష్ట్రేతర ప్రాంతాలలో సైతం సంచలనం సృష్టిస్తోంది.
ఇటీవల ఈ దేశహోమ్ శాఖామంత్రి అమిత్ షా ఆవిష్కరించి పురాణపండ శ్రీనివాస్ ని అభినందించిన విషయం కవిత్వ, సాహిత్య, , ఆధ్యాత్మిక వర్గాలలో ఆసక్తిని రేకెత్తించడంతో పాటు ఆశ్చర్య పరిచింది కూడా !
భౌతికాతీతమైన ఆనందానుభవాన్ని కలిగించే ఈ ఆంజనేయ గ్రంధం ‘ నన్నేలు నా స్వామి ” ఒక్కోపేజీ తిప్పుతుంటే ఒక మధురమైన పరవశం కలుగుతోందని సాక్షాత్తూ తిరుమల ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులన్నారంటే ఈ అఖండ శక్తిని మనం తెలుసుకోవాలి.
గందరగోళాలను , గజిబిజి పరిస్థితులను విసిరికొట్టి పరిపూర్ణ స్పృహ కలిగించే అత్యున్నత, అత్యుత్తమ హనుమాన్ బుక్ ఇది.
తెలుగు రాష్ట్రాలలో దైవీయ స్పృహల గ్రంధాల అపురూప రచనలు చేయడంలో , సంకలనాల ప్రచురణలో అందెవేసిన చెయ్యి ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ దని ప్రత్యేకంగా చెప్పఖ్ఖర్లేదు.
నిస్వార్ధ సేవలో, అద్భుత రచనల్లో , ఆధ్యాత్మిక ప్రచురణల ప్రచారోద్యమంలో తెలుగు రాష్ట్రాలలో తొలి వరుసలో దూసుకు పోతున్న ప్రముఖ రచయిత , శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ ఇప్పుడు దేశ రాజధాని న్యూ ఢిల్లీ లో
సాక్షాత్తూ ఈ దేశ హోంశాఖామంత్రి అమిత్ షా తో ‘ నన్నేలు నా స్వామి ‘ అనే తన హనుమాన్ మహాగ్రంధాన్ని ఆవిష్కరింప చేసి ‘ శభాష్ ‘ అనిపించుకున్నారు.

ఇదేమన్నా మామూలు విషయం అనుకుంటున్నారా ?

ఈ దేశ హోమ్ మంత్రిని కలవడం మామూలు విషయమా ? మామూలు సెక్యూరిటీనా ? తమ పార్టీలో … తమ సహచార మంత్రులే గంటగంటలు వెయిట్ చేసినా ఇంటర్వ్యూ దొరకని ఘటనలు కూడా లేకపోలేదు.
పరిమిత పరిధుల నుండి అపరిమితస్థితికి తీసుకెళ్లేలా తెలుగు రాష్ట్రాలలో పవిత్ర ఆధ్యాత్మిక సేవ విస్తృతంగా చేస్తున్న పురాణపండ శ్రీనివాస్ కి వెంటనే ఈ ఘనత దక్కడానికి ఆయన హృదయ సంస్కారమే కారణం. నిస్వార్ధ సేవ, నిష్కపట హృదయమే కారణం.

జీవన యాత్రలో ఎన్నో ఆటుపోట్లకు, ఎత్తు పల్లాలకు సాక్ష్యంగా నిలిచిన ‘ పురాణపండ శ్రీనివాస్’ అద్భుతమైన ఆంజనేయ స్వామి రచనా సంకలనాన్ని చూసిన అమిత్ షా మొత్తం పుస్తకం తిరగేసి ఆశ్చర్య పోయారట.

ఇప్పుడీ గ్రంధం మేధో సమాజాన్ని, హనుమద్ భక్తులను , భక్త సమాజాన్ని విశేషంగా ఆకర్షిస్తోంది.

మానవ మేధకు అతీతంగా ఋషులందించిన అనేక అపురూప అంశాలతో, తన అందమైన శైలీ విన్యాసంతో, అత్యంత ఆకర్షణీయంగా, అతి అరుదైన వందలాది హనుమాన్ చిత్రాలతో ఎంతో ఎంతో అద్భుతంగా పురాణపండ శ్రీనివాస్ రూపుదిద్దిన ఈ నైతిక వివేక గ్రంధం ఢిల్లీ, హైదరాబాద్ భారతీయ జనతాపార్టీ నేతల ద్వారా , విశ్వ హిందూ పరిషత్ ప్రముఖుల ద్వారా వందలాదివిజ్ఞులకు అందిందని మీడియా కోడై కూసింది. బుక్ అదిరిపోయిందని పురాణపండ పై ప్రశంసల వర్షం వర్షించింది.
మొన్న రాజమండ్రిలోజరిగిన కళాప్రపూర్ణ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి శత జయంతి ఉత్సవం లో ఈ బుక్ ని ప్రధాన ఆకర్షణగా పదిమందికీ పంచారు సీనియర్ పాత్రికేయులు సన్నిధానం శాస్త్రి.

ఈ హనుమాన్ బుక్ ని తీసుకున్న రాజకీయ యోధులు, పార్లమెంట్ మాజీ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ చాలా ఆసక్తిగా ఈ మహా గ్రంధాన్ని పరిశీలించారు. పురాణపండ శ్రీనివాస్ కృషిని అభినందించారు.

ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చి, ఎన్నో కష్టాలు పడి , విమర్శలకు వెరవక , ఒంటరిగా కష్టపడే ఒక ప్రతిభావంతునికి భగవంతుని కరుణ కాకపోతే మరేమిటి?

ఇది హనుమంతుని అపారమైన కటాక్షం. స్వయంకృషికి దక్కిన ఫలితం.

ఇటీవల చెన్నై లో జరిగిన ఒక ఆత్మీయ సమావేశంలో ఈ పుస్తకం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.

చిన్నతనంలో తామంతా చదువుకున్న చెన్నైమైలాపూర్ కేసరి హయ్యర్ సెకండరీ స్కూల్ లో ఆనాటి జ్ఞాపకాల్ని పంచుకుంటూ నాటి విద్యార్థి బృందం అంతా కలుసుకున్న సంతోష సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొని చక్కని ప్రసంగం చేసి ఆకట్టుకున్న నాటి విద్యార్థి, నేటి ఐ.డి.ఆర్.బి.టి. డైరెక్టర్ ఏ.ఎస్. రామశాస్త్రికి ఈ అఖండ గ్రంధాన్ని ఒక అందమైన పవిత్ర జ్ఞాపికగా బహూకరించారు కాకినాడకు చెందిన ప్రముఖులు పాణంగిపల్లి శ్రీనివాస్ . ఈయన కూడాకేసరి స్కూల్ విద్యార్ధే.

పాల్గొన్న తమ స్నేహితులందరికీ ఈ ‘ నన్నేలు నా స్వామి ‘ గ్రాండ్ బుక్ ని పాణంగిపల్లి శ్రీనివాస్ అందజేయడంతో వారి ఆనందానికి అవధులు లేవు.

ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ , ఎంతో సంస్కారంగా ఏ. ఎస్. రామశాస్త్రి అపూర్వమైన ప్రసంగం చేసి సభికుల్ని, తన చిన్న నాటి స్నేహితుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు.

సుమారు మూడు వందలమందికి ఈ నన్నేలు నా స్వామి అఖండ దివ్య గ్రంధాన్ని అందించారు.

ఒక ఉపాస్య విశేష గ్రంధంగా అందరి ప్రశంసలు పొందుతున్న ఈ పుస్తక నిర్మాణంలో , రచనలో, సంకలనంలో పురాణపండ శ్రీనివాస్ తీసుకున్న అనితర సాధ్యమైన ఆసక్తికి , నిర్మాణాత్మక సామర్ధ్యానికి పండిత పామర వర్గాలు శభాష్ అంటున్నాయి.

పురాణపండ శ్రీనివాస్ కృషితో అందిన ఈ గ్రంధం చరిత్రకెక్కడం తధ్యం. ఇలాంటి ఆంజనేయగ్రంధం ఇంతవరకూ చూడలేదని మేధో సమాజం ప్రశంసించడం ఆయన రచన సంకలన వైభవానికి కాలం ఎత్తిన జయ పతాకగా చెప్పక తప్పదు.

‘ ఈగ ‘ చలన చిత్రంతో జాతీయ పురస్కారం కైవసం చేసుకున్న , వారాహి చలన చిత్రం అధినేత, లెజెండ్, కె.జి.ఎఫ్. చలన చిత్రాల నిర్మాత సాయి కొర్రపాటి ( బాహుబలి రాజమౌళి ఆంతరంగిక మిత్రుడు ) ఈ అద్భుత గ్రంధానికి సమర్పకులుగా వ్యవహరించి జీవనదన్యతను పొందారని అన్ని చోట్లా అభినందనలు పొంగడం విశేషం.