నా తప్పును క్షమించండి!

Friday, April 24th, 2015, 12:16:55 PM IST


కేంద్ర ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా బుధవారం ఆప్ పార్టీ చేపట్టిన ర్యాలీలో రాజస్థాన్ కు చెందిన గజేంద్ర సింగ్ అనే రైతు ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే అతనిని ఆసుపత్రికి తరలించిన అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాదాపు పది నిమిషాల పాటు ప్రసంగించారు. ఇక దీనితో గజేంద్రను రక్షించడంలో ఆప్ నేతలు, కార్యకర్తలు నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారని, వేదికపై ఉండి చోద్యం చూశారని ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. ఈ క్రమంలో కేజ్రీవాల్ జరిగిన ఘటనపై స్పందిస్తూ క్షమాపణ తెలిపారు.

ఇక గజేంద్ర సింగ్ ఆత్మహత్య నేపధ్యంగా విమర్శలతో తలపట్టుకుంటున్న కేజ్రీవాల్ తన తప్పును సరి చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఘటన జరిగిన రెండు రోజుల అనంతరం స్పందించిన కేజ్రీవాల్ ‘నేను తప్పు చేశాను.. క్షమించండి, ఆ దుర్ఘటన అనంతరం ప్రసంగించి ఉండాల్సింది కాదు.. ఎవరినైనా బాధపెట్టి ఉంటే నన్ను మన్నించండి’ అంటూ క్షమాపణ తెలిపారు.