తమిళనాడులో దూసుకుపోతున్న ‘అమ్మ’

Friday, September 26th, 2014, 11:13:54 AM IST


తమిళనాడులో అమ్మ పేరుతొ ఆ రాష్ట్రముఖ్యమంత్రి జయలలిత అనేక పధకాలు ప్రారంభించారు. కేవలం 5 రూపాయలకే భోజనం పధకం మంచి విజయం సాధించడంతో అమ్మ పేరుతో పధకాలు రోపొందించేందుకు ముఖ్యమంత్రి కృషిచేస్తున్నారు. తాజాగా, 15 రూపాయలతో ఉదయం టిఫెన్ మధ్యాహ్నం భోజనం చేయవచ్చు.

ఇవేకాకుండా అమ్మ పేరుతొ మెడికల్ షాప్స్ కూడా ప్రారంభించారు. పేదవాడికి ఎంటర్ టైన్మెంట్ అవసరమని అమ్మ సినిమా థియోటర్లు కూడా ప్రారంభిస్తునారు. ఇప్పటికే అమ్మ పేరుతో వంటింటి సామాన్లు మహిళా గృహాలకు చేరుతున్నాయి. తాజాగా అమ్మ మరో పథకాన్ని రూపొందించింది. అదే అమ్మ సిమెంట్. ప్రస్తుతం మార్కెట్లో సిమెంట్ బస్తాధర 310 రూపాయలు ఉన్నది. అమ్మసిమెంట్ పధకం ద్వారా సిమెంట్ బస్తాను కేవలం 190 రూపాయలకే అందిస్తున్నారు… అమ్మ పేరుతొ మరిన్ని పధకాలు రూపొందించడానికి ప్రభుత్వం కృషిచేస్తున్నది. రాష్ట్రంలో పేదవాడికి అన్ని సమకురాలనే అమ్మ పేరుతొ చౌకగా వస్తువులు అందిస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలియజేస్తున్నారు.